Telugu Global
Cinema & Entertainment

బన్నీ సరసన 'గీత'

గీతగోవిందం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే రష్మికపై కన్నేశాడు బన్నీ. కుదిరితే ఆమెతో కలిసి ఓ సినిమా చేస్తానంటూ అప్పట్లోనే ప్రకటించాడు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. గీతగోవిందం సినిమాలో గీత పాత్రతో యూత్ కు దగ్గరైన రష్మిక, బన్నీ సరసన నటించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ […]

బన్నీ సరసన గీత
X

గీతగోవిందం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే రష్మికపై కన్నేశాడు బన్నీ. కుదిరితే ఆమెతో కలిసి ఓ సినిమా చేస్తానంటూ అప్పట్లోనే ప్రకటించాడు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. గీతగోవిందం సినిమాలో గీత పాత్రతో యూత్ కు దగ్గరైన రష్మిక, బన్నీ సరసన నటించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

గీతాఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మంచి లైన్స్ రాసుకున్నాడు త్రివిక్రమ్. సినిమాకు ఆ పాత్ర చాలా కీలకం అని కూడా తెలుస్తోంది. అలాంటి పాత్రలో రష్మికను తీసుకుంటే బాగుంటుందని స్వయంగా బన్నీ సూచించాడట. ప్రస్తుతానికైతే బన్నీ సూచన మేరకు రష్మిక పేరుతో పాటు మరికొందరు హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నాడు త్రివిక్రమ్. బన్నీతో పాటు అల్లు అరవింద్ కూడా రష్మిక వైపే మొగ్గుచూపుతుండడంతో దాదాపు ఆమె ఖరారైనట్టే.

త్వరలోనే బన్నీ-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి రాబోతోంది. గీతా ఆర్ట్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. సినిమా టైటిల్ తో పాటు మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడించబోతున్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

First Published:  7 Feb 2019 11:44 PM GMT
Next Story