వెంకీ కూతురు పెళ్లి ఫిక్స్ అయ్యింది…

విక్టరీ వెంకటేష్ సాధారణంగా తన ఫ్యామిలీ కి సంబంధించిన ఏ విషయాన్నీ కూడా బయట వాళ్ళతో పంచుకోడు. ఇప్పుడు తన పెద్ద కూతురి పెళ్లి కూడా వెంకటేష్ ఎవ్వరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా జరిపిస్తున్నాడు.

వెంకటేష్ పెద్ద కూతురు అయిన ఆశ్రిత కి అలాగే హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్ మెన్ అయిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ కి ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి కూడా చాలా తక్కువ మందిని ఆహ్వానించాడు వెంకీ.

ఇక ఇప్పుడు వచ్చే నెల 24 న జరగనున్న పెళ్లి వేడుకకి కూడా చాలా తక్కువ మందిని పిలవాలనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నాడట. ఎందుకంటే వెంకటేష్ కి హడావుడి అంటే అస్సలు నచ్చదట. పైగా పెళ్లిని చాలా సింపుల్ గా చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడట. దీని కోసం నానక్ రామ్ గూడ లో రామానాయుడు స్టూడియోస్ ని పెళ్లి వేడుక చేయనున్నాడట వెంకీ.

ఇది వరకు సురేష్ బాబు పెద్ద కూతురి వివాహం కూడా అక్కడే చాలా నిరాడంబరంగా చాలా తక్కువ మంది అతిధుల మధ్య జరిగిపోయింది. ఇప్పుడు వెంకటేష్ కూతురి పెళ్లి కూడా అంతే.