నాని విషయంలో మనసు మార్చుకున్న ఇంద్రగంటి

న్యాచురల్ స్టార్ నాని “అష్ట చమ్మ” సినిమాతో హీరోగా పరిచయం అయి…. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నానికి హీరోగా లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో నాని హీరోగా వరుస అవకాశాలతో దూసుకుపోయాడు.

ఇక ఆ సినిమా తరువాత వీళ్ళ కాంబినేషన్ లో “జెంటిల్ మెన్” సినిమా వచ్చి హిట్ అయ్యింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక లో మూడో సినిమా రాబోతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాని మొదట మల్టిస్టారర్ గా తెరకెక్కించాలని ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ భావించాడు.

కానీ ఇప్పుడు నాని ఒక్కడినే హీరోగా పెట్టి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడట. దీంతో మరో కొత్త కథను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడట ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ.

ఇక ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ చెప్పిన లైన్ దిల్ రాజుకి విపరీతంగా నచ్చిందట. అందుకే వెంటనే ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ ని సమ్మర్ లోపు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకొని రమ్మని చెప్పాడట దిల్ రాజు.

ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమాతో పాటు విక్రం కే కుమార్ సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు.