Telugu Global
NEWS

ఆడియో టేపుల సంగ‌తి తేల్చాలి....

ఓటుకు నోటు కేసును ఎన్ఐఏకు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశాడు జ‌రుస‌లేం మ‌త్త‌య్య‌. ఈ కేసులో దోషులైన చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిలతో త‌న‌ను క‌లిపి చూడ‌డం వ‌ల్ల తాను ఎంతో మాన‌సిక క్షోభ అనుభ‌విస్తున్నాన‌ని ఆవేద‌న చెందారు. చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి లాంటి వారిని శిక్షించకుండా వ‌దిలేస్తే ప్ర‌జాస్వామ్యం హ‌త్య‌కు గుర‌వుతుంద‌న్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ ఎవ‌రిదో తేలిస్తే… రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు ఒక క్లారిటీతో ఓటేసేందుకు వీలుంటుంద‌న్నారు. త‌న‌ను హైకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించినా…. ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. శిక్ష ప‌డితే త‌న‌తో […]

ఆడియో టేపుల సంగ‌తి తేల్చాలి....
X

ఓటుకు నోటు కేసును ఎన్ఐఏకు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశాడు జ‌రుస‌లేం మ‌త్త‌య్య‌. ఈ కేసులో దోషులైన చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిలతో త‌న‌ను క‌లిపి చూడ‌డం వ‌ల్ల తాను ఎంతో మాన‌సిక క్షోభ అనుభ‌విస్తున్నాన‌ని ఆవేద‌న చెందారు.

చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి లాంటి వారిని శిక్షించకుండా వ‌దిలేస్తే ప్ర‌జాస్వామ్యం హ‌త్య‌కు గుర‌వుతుంద‌న్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ ఎవ‌రిదో తేలిస్తే… రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు ఒక క్లారిటీతో ఓటేసేందుకు వీలుంటుంద‌న్నారు.

త‌న‌ను హైకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించినా…. ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. శిక్ష ప‌డితే త‌న‌తో పాటు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డికి కూడా ప‌డాల‌ని డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబు ఆడియో టేపుల వ్య‌వ‌హారాన్ని తేల్చాల‌ని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద తాను నిర‌స‌న దీక్ష చేప‌డుతున్న‌ట్టు మ‌త్త‌య్య ప్ర‌క‌టించారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన చంద్ర‌బాబును ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేధించాల‌ని కోరారు.

First Published:  9 Feb 2019 5:10 AM GMT
Next Story