“మహర్షి” విషయంలో దిల్ రాజే ముందున్నాడు!

మహేష్ బాబు హీరోగా వస్తున్న “మహర్షి” సినిమాకి ముగ్గురు ప్రొడ్యూసర్స్ అన్న విషయం తెలిసిందే. వైజయంతి క్రియేషన్స్ పై అశ్వినీ దత్, పీవిపీ సినిమా పై ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ముగ్గురూ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కానీ వార్తల్లో మాత్రం దిల్ రాజు పేరు మాత్రమే బాగా వినపడుతోంది.

దీనికి కారణం…. “మహర్షి” కి సంబంధిచిన ఏ న్యూస్ అయినా కూడా దిల్ రాజు కంపౌండ్ నుంచే వస్తోంది. ఈ సినిమా పనుల విషయంలో అశ్విని దత్ గాని ప్రసాద్ గాని పెద్దగా జోక్యం చేసుకోవట్లేదని అంటున్నారు.

ఎందుకంటే సినిమా షూటింగ్ మొదలైన దగ్గరినుంచి ఇప్పుడు డబ్బింగ్ పనుల వరకు దిల్ రాజే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. అందుకే దిల్ రాజు పేరు మీడియాలో ఎక్కువగా వినపడుతోందని అంటున్నారు.