పెళ్లికి సిద్ధం…. కానీ..!

పెళ్లిపై మిల్కీబ్యూటీ స్పందించింది. పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే తన మనసులో మాత్రం ఎవరూ లేరని స్పష్టంచేసింది తమన్న. దటీజ్ మహాలక్ష్మి మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హీరోయిన్.. పెళ్లిపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది.

ప్రస్తుతం తన మనసులో ఎవరూ లేరని, కనీసం తను డేటింగ్ కూడా చేయడం లేదని స్పష్టంచేసింది తమన్న. పెళ్లికి సంబంధించిన నిర్ణయాన్ని పూర్తిగా తన తల్లిదండ్రులకు వదిలేసినట్టు తెలిపింది. వాళ్లు ఎవర్ని చూపిస్తే వాళ్లనే పెళ్లిచేసుకుంటానంటోంది ఈ చిన్నది.

మరోవైపు దటీజ్ మహాలక్ష్మి సినిమాకు సంబంధించిన ఓ వివాదంపై కూడా స్పందించింది తమన్న. దర్శకుడి పేరు లేకుండానే ఈ సినిమాను విడుదల చేస్తామంటోంది. ఈ మూవీని మొదట నీలకంఠ డైరక్ట్ చేశాడు. తర్వాత తమన్నతో అతడికి చెడింది. ఫలితంగా ప్రాజెక్టు నుంచి నీలకంఠ తప్పుకోవడంతో బ్యాలెన్స్ వర్క్ ను ప్రశాంత్ వర్మతో పూర్తిచేశారు.

ఇలాంటి టైమ్ లో ఎవరి పేరు వేసినా లీగల్ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో దర్శకుడి పేరు లేకుండానే సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించారు. ఆల్రెడీ పోస్టర్లు, టీజర్లు, ట్రయిలర్లలో దర్శకుడి పేర్లను తీసేశారు.