యాత్ర ఫస్ట్ డే వసూళ్లు

హార్ట్ టచింగ్ గా ఉంది యాత్ర సినిమా. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కానీ ఈ సినిమాకు మొదటి రోజు వసూళ్లు తక్కువగా వచ్చాయి. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఇది పొలిటికల్ మూవీ అనే భ్రమలో చాలామంది ప్రేక్షకులు ఉండిపోయారు. ఇక రెండోది.. నిర్మాతలు కావాలనే ఈ సినిమాను లిమిటెడ్ గా రిలీజ్ చేశారు.

ఈ రెండు కారణాల వల్ల యాత్ర సినిమాకు మొదటి రోజు వసూళ్లు తక్కువగా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ఫస్ట్ డే మూడున్నర కోట్ల రూపాయల నెట్ రాగా, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 26 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సోమవారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే, థియేటర్లు పెంచడంతో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఏపీ, నైజాంలో యాత్ర సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 0.62 కోట్లు
సీడెడ్ – రూ. 0.42 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.14 కోట్లు
ఈస్ట్ – రూ. 0.10 కోట్లు
వెస్ట్ – రూ. 0.16 కోట్లు
గుంటూరు – రూ. 0.46 కోట్లు
కృష్ణా – రూ. 0.19 కోట్లు
నెల్లూరు – రూ. .17 కోట్లు