జ‌బ‌ర్ద‌స్త్ టీంపై యువ‌కుల దాడి… అరెస్ట్‌కు క‌లెక్ట‌ర్ ఆదేశం

జ‌బ‌ర్ద‌స్త్ ఫేం న‌రేష్ డ్యాన్స్ టీంపై దాడి జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క‌ళింగాంధ్రా ఉత్స‌వాల్లో పాల్గొని
వ‌స్తున్న స‌మ‌యంలో కొంద‌రు యువ‌కులు దాడి చేసి కొట్టారు. శ్రీకాకుళం చిన్న‌బ‌రాటం వీధికి చెందిన యువ‌కులు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు గుర్తించారు.

న‌టులు ఉన్న గ్రీన్ రూమ్‌లోకి యువ‌కులు తొంగిచూడ‌డంతో తొలుత వివాదం మొద‌లైంది. బౌన్స‌ర్లు వారితో దురుసుగా ప్రవర్తించారు. దాన్ని మ‌న‌సులో పెట్టుకున్న స్థానిక యువ‌కులు… జ‌బ‌ర్ద‌స్త్ టీం కార్య‌క్ర‌మం ముగించుకుని తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో వారి వాహ‌నాల‌పై రాళ్లు రువ్వారు.

దాడిలో పాల్గొన్న ఒక యువ‌కుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ దాడి ప‌ట్ల క‌లెక్ట‌ర్ తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.