Telugu Global
Cinema & Entertainment

జెర్సీ శాటిలైట్ డీల్ పూర్తి

మరో పెద్ద సినిమా శాటిలైట్ పూర్తిచేసుకుంది. నాని హీరోగా నటిస్తున్న జెర్సీ సినిమాను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. అది ఎంత మొత్తానికనే విషయం ఇంకా బయటకు రాలేదు. జీ తెలుగు ఛానెల్ తమ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుందనే విషయాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి […]

జెర్సీ శాటిలైట్ డీల్ పూర్తి
X

మరో పెద్ద సినిమా శాటిలైట్ పూర్తిచేసుకుంది. నాని హీరోగా నటిస్తున్న జెర్సీ సినిమాను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. అది ఎంత మొత్తానికనే విషయం ఇంకా బయటకు రాలేదు.

జీ తెలుగు ఛానెల్ తమ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుందనే విషయాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న జెర్సీ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా శాటిలైట్ డీల్ పూర్తిచేశారు. మరో వారం రోజుల్లో థియేట్రికల్ బిజినెస్ మొదలవుతుంది.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది జెర్సీ సినిమా. వయసు పైబడిన ఓ కుర్రాడు, లేటు వయసులో ఎలా క్రికెట్ లో సక్సెస్ అయ్యాడు, ఎలా తన ప్రేమను గెలిపించుకున్నాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు.

First Published:  10 Feb 2019 11:22 AM GMT
Next Story