Telugu Global
NEWS

క‌న్నా పేరు గ‌ల్లంతు.... అడ్డుకున్న పోలీసులు

ప్రధాని న‌రేంద్రమోడీ రాక సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అవ‌మానం జ‌రిగింది. ఎయిర్‌పోర్టులోకి క‌న్నా వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదంటూ క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌ను అనుమ‌తించ‌లేదు. దీంతో పోలీసుల‌పై క‌న్నా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిన‌ని, ప్ర‌ధాని మోడీతో క‌లిసి హెలికాప్ట‌ర్ లో గుంటూరు వెళ్లాల్సి ఉంద‌ని చెప్పినా పోలీసులు విన‌లేదు. దాంతో ఆయ‌న పోలీసుల తీరును నిర‌సించారు. ప్రధానిని కలిసే వారి లిస్ట్‌లో పొర‌పాటున ఆయ‌న పేరు […]

క‌న్నా పేరు గ‌ల్లంతు.... అడ్డుకున్న పోలీసులు
X

ప్రధాని న‌రేంద్రమోడీ రాక సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అవ‌మానం జ‌రిగింది.

ఎయిర్‌పోర్టులోకి క‌న్నా వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదంటూ క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌ను అనుమ‌తించ‌లేదు. దీంతో పోలీసుల‌పై క‌న్నా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిన‌ని, ప్ర‌ధాని మోడీతో క‌లిసి హెలికాప్ట‌ర్ లో గుంటూరు వెళ్లాల్సి ఉంద‌ని చెప్పినా పోలీసులు విన‌లేదు. దాంతో ఆయ‌న పోలీసుల తీరును నిర‌సించారు. ప్రధానిని కలిసే వారి లిస్ట్‌లో పొర‌పాటున ఆయ‌న పేరు చేర్చ‌లేద‌ని భావిస్తున్నారు.

First Published:  9 Feb 2019 11:26 PM GMT
Next Story