ప‌కోడి గాళ్లారా…. ద‌మ్ముంటే నా ముందుకు రండి…. పోస్ట‌ర్ల‌పై కొడాలి ఫైర్

ప్ర‌ధాని మోడీ రాక సంద‌ర్బంగా గుడివాడ ప్రాంతంలో కొంద‌రు పోస్ట‌ర్లు అతికించారు. ప్ర‌ధాని మోడీకి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్టుగా పోస్ట‌ర్ల‌లో ఉంది. ఈ పోస్ట‌ర్ల‌ను చాలా చోట్ల గోడలకు అంటించారు. మోడీకి, వైసీపీ మ‌ధ్య బంధం ఉందని చాటేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ప్ర‌చారంపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చారు.

పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫొటో, నా ఫొటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు మేం కాదు…. మోడీ ఐనా చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే… అంటూ కొడాలి నాని విరుచుకుప‌డ్డారు.

మోడీకి, వైసీపీకి మ‌ధ్య సంబంధాలున్నాయ‌ని న‌మ్మించేందుకు టీడీపీ శ్రేణులే ఈ పోస్ట‌ర్ల‌ను సృష్టించి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫోటో, నా ఫోటో పెట్టి బ్యానర్లు…

Posted by Kodali NANI on Saturday, 9 February 2019