Telugu Global
Cinema & Entertainment

లక్ష్మీస్ ఎన్టీఆర్.... ఇది కుట్రల చిత్రం

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ ప్రారంభించి 2 నెలలైనా కాకముందే విడుదలకు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్లలోకి వస్తుంది. అయితే విడుదల తేదీ కంటే ముందు ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు వర్మ. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ప్రేమజీవితం అత్యంత గొప్పదని అంటున్న వర్మ.. వాళ్ల వైవాహిక-ప్రేమ జీవితానికి గుర్తుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయిలర్ ను ప్రేమికుల రోజు […]

లక్ష్మీస్ ఎన్టీఆర్.... ఇది కుట్రల చిత్రం
X

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ ప్రారంభించి 2 నెలలైనా కాకముందే విడుదలకు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్లలోకి వస్తుంది. అయితే విడుదల తేదీ కంటే ముందు ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు వర్మ.

ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ప్రేమజీవితం అత్యంత గొప్పదని అంటున్న వర్మ.. వాళ్ల వైవాహిక-ప్రేమ జీవితానికి గుర్తుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయిలర్ ను ప్రేమికుల రోజు నాడు విడుదల చేస్తామని ప్రకటించాడు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ట్రయిలర్ రాబోతోందని, అందులో ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల ప్రేమ సన్నివేశాలు చూస్తారని అంటున్నాడు.

మొన్నటివరకు ఈ సినిమాతో చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు వర్మ. వెన్నుపోటు సాంగ్ విడుదల చేసి దానిపై చంద్రబాబు ఫొటోలు వేశాడు. అంతేకాదు, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని కుటుంబ కథాచిత్రంగా కాకుండా, కుటుంబ కుట్రల చిత్రంగా చూడాలని పిలుపునిస్తున్నాడు. ఇలా ఎన్టీఆర్ వెన్నుపోటు చిత్రంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ప్రచారం చేసిన వర్మ, ఇప్పుడు దానికి లవ్ యాంగిల్ కూడా జోడించడం విశేషం.

First Published:  10 Feb 2019 1:09 AM GMT
Next Story