ఈసారి గౌతమ్ మీనన్ ఏం చేస్తాడో!

అర్జున్ రెడ్డి రీమేక్ గా తమిళ్ లో తెరకెక్కుతున్న వర్మ సినిమాపై నడుస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకంగా కాన్సిల్ చేసి పడేశాడు హీరో విక్రమ్. కొడుకు ధృవ్ అరంగేట్రం చేస్తున్న వర్మ సినిమా అవుట్ పుట్ అస్సలు బాగాలేదంటూ సినిమాను రీషూట్ చేయమని ఆదేశించాడు. ఈ క్రమంలో ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత బాలనే పక్కన పెట్టేయడం విశేషం.

వర్మ ప్రాజెక్టు నుంచి బాలను తప్పించడంతో ఇప్పుడా స్థానంలో ఎవర్ని తీసుకుంటారనే చర్చ జోరందుకుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం గౌతమ్ మీనన్, వర్మ సినిమాను రీషూట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ మేరకు విక్రమ్, గౌతమ్ మీనన్ మధ్య చర్చలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదాలు సద్దుమణిగిన తర్వాత గౌతమ్ మీనన్ పేరును అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా తొలిగించే ప్రాసెస్ మొదలైంది. ధృవ్ సరసన హీరోయిన్ గా మేగ చౌదరి నటించగా, ఆమె పెర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాగాలేదని విక్రమ్ అభిప్రాయపడ్డాడట. ఫలితంగా ఆమెను తొలిగించి, ఆ స్థానంలో శ్రీదేవి కూతురు జాన్విని తీసుకోవాలని భావిస్తున్నారట.

తన సినిమాలతో ఏకంగా జాతీయ అవార్డు సైతం అందుకున్న బాల, వర్మ సినిమాకు న్యాయం చేయలేకపోయాడట. బాల వర్క్ విక్రమ్ కు నచ్చలేదట. మరి గౌతమ్ మీనన్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.