Telugu Global
NEWS

విలాస దీక్ష‌... 3,500 మందికి ఏసీ గ‌దులు

చంద్ర‌బాబు ఢిల్లీలో త‌ల‌పెట్టిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు ధ‌న ప్ర‌వాహం సాగింది. దాదాపు 12 కోట్లు పెట్టి చంద్ర‌బాబు ఈ దీక్ష చేస్తున్నారు. దీక్ష‌కు ఉద్యోగులు, సంఘాల నేత‌ల‌ను రెండు ప్ర‌త్యేక రైళ్ల‌లో ఢిల్లీకి త‌ర‌లించారు. కీల‌క‌మైన వారిని, టీడీపీ నేత‌ల‌ను విమానాల్లో తీసుకెళ్లారు. ఢిల్లీలోని దీక్ష‌కు వ‌చ్చిన వారి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని ల‌గ్జ‌రీ హోట‌ళ్ల‌లో 3వేల 500 మందికి ఏసీ గ‌దులు బుక్ చేశారు. వీటిని టీడీపీ త‌ర‌పున కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌జాధ‌నంతోనే బుక్ చేయ‌డం విశేషం. ఢిల్లీలో అత్యంత […]

విలాస దీక్ష‌... 3,500 మందికి ఏసీ గ‌దులు
X

చంద్ర‌బాబు ఢిల్లీలో త‌ల‌పెట్టిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు ధ‌న ప్ర‌వాహం సాగింది. దాదాపు 12 కోట్లు పెట్టి చంద్ర‌బాబు ఈ దీక్ష చేస్తున్నారు. దీక్ష‌కు ఉద్యోగులు, సంఘాల నేత‌ల‌ను రెండు ప్ర‌త్యేక రైళ్ల‌లో ఢిల్లీకి త‌ర‌లించారు. కీల‌క‌మైన వారిని, టీడీపీ నేత‌ల‌ను విమానాల్లో తీసుకెళ్లారు. ఢిల్లీలోని దీక్ష‌కు వ‌చ్చిన వారి కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీలోని ల‌గ్జ‌రీ హోట‌ళ్ల‌లో 3వేల 500 మందికి ఏసీ గ‌దులు బుక్ చేశారు. వీటిని టీడీపీ త‌ర‌పున కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌జాధ‌నంతోనే బుక్ చేయ‌డం విశేషం. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్‌ రాయల్‌ ప్లాజాలో మంత్రుల కోసం 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్‌ చేశారు.

హోటల్‌ సూర్యలో 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లకు వసతి కల్పిస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర భవన్‌లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్‌ హోటళ్లలో కూడా వందల సంఖ్యలో గదులు బుక్‌ చేశారు. వీరందరినీ సీఎం చంద్రబాబు దీక్ష చేసే ఏపీ భవన్‌ వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా 32 బస్సులను ఏర్పాటు చేశారు.

First Published:  10 Feb 2019 9:25 PM GMT
Next Story