నా దీక్ష‌ను టీవీల్లో చూపించండి – దీక్షా వేదిక‌పై జాతీయ మీడియాకు బాబు విజ్ఞ‌ప్తి

ఢిల్లీలో ధ‌ర్మ‌పోరాట దీక్షలో ప్రారంభోప‌న్యాసం చేసిన చంద్ర‌బాబు… జాతీయ మీడియాకు ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. త‌న దీక్ష‌కు ప్ర‌చారం క‌ల్పించాల్సిందిగా కోరారు.

త‌న దీక్ష‌ను చూపించ‌వ‌ద్ద‌ని మీడియా సంస్థ‌ల‌పై మోడీ ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తోంద‌ని ఆరోపించారు. ఆ విష‌యం త‌న‌కు తెలుస‌న్నారు. కానీ తాము కూడా ఈ దేశంలో భాగ‌మేన‌ని…. ఆ విష‌యాన్ని జాతీయ మీడియా కూడా గుర్తుంచుకోవాల‌న్నారు.

ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని త‌న దీక్ష‌కు స‌రైన ప్ర‌చారం క‌ల్పించాల‌ని కోరారు. మోడీ బాధ్య‌త‌ను గుర్తు చేసేందుకు తాను
వ‌చ్చాన‌ని… ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన బాధ్య‌త జాతీయ మీడియాపై ఉంద‌న్నారు.

ఒక‌వేళ మీడియా త‌న దీక్ష‌ను చూపించ‌క‌పోతే తాను చాలా బాధ‌ప‌డుతాన‌ని… చంద్ర‌బాబు దీక్ష వేదిక మీద నుంచి జాతీయ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.