Telugu Global
NEWS

ఇంటెలిజెన్స్ ను ఇలా వాడుకుంటున్నారు

“గెలవాలి. మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏమైనా చెయ్యాలి” ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఏకైక లక్ష్యం. ఇందుకోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పసుపు కుంకుమ పథకం, బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు మరో పథకం, కాపులకు 5 శాతం రిజర్వేషన్ తో మరో వ్యూహం… ఇలా ప్రతి కులానికి ఇది చేశా… అది చేశామంటూ ప్రకటనలు.. ఇలా అన్ని మార్గాలను తన […]

ఇంటెలిజెన్స్ ను ఇలా వాడుకుంటున్నారు
X

“గెలవాలి. మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏమైనా చెయ్యాలి” ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఏకైక లక్ష్యం. ఇందుకోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పసుపు కుంకుమ పథకం, బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు మరో పథకం, కాపులకు 5 శాతం రిజర్వేషన్ తో మరో వ్యూహం… ఇలా ప్రతి కులానికి ఇది చేశా… అది చేశామంటూ ప్రకటనలు.. ఇలా అన్ని మార్గాలను తన వైపు తిప్పుకునేలా చంద్రబాబు నాయుడు “పథక” రచన చేస్తున్నారు.

అయితే, తనపై తనకు నమ్మకం తగ్గిన చంద్రబాబు నాయుడు తాను అమలు చేస్తున్న పథకాల పై ఇంటిలిజెన్స్ ద్వారా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. తాను గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా చేపట్టిన పథకాలతో పాటు కొత్తగా తీసుకు వచ్చిన పలు అంశాలపై కూడా ఇంటెలిజెన్స్ విభాగం చేత సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జిల్లాల వారీగా చేపడుతున్న ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు. వ్యతిరేకంగా ఎంత మంది ఉన్నారు అనే అంశాలను గణాంకాలతో సహా లెక్కలు తీస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇంటిలిజెన్స్ విభాగంలో ప్రత్యేకంగా కొందరిని నియమించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ముందు జిల్లాల వారీగా సర్వే చేయిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలో కూడా సర్వే చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ, బీసీలకు ఇస్తున్న వరాలు, ఇతర పథకాల పై ఇంటిలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో సర్వేల ఆధారంగానే పథకాల రూపకల్పన తోపాటు అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  11 Feb 2019 5:00 AM GMT
Next Story