Telugu Global
NEWS

చంచల్‌గూడ జైల్లో జయరాం హత్య కేసు నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం కేసు ఇప్పుడు తెలంగాణ పోలీసుల చేతిలో ఉంది. శనివారం నందిగామ వెళ్లి నిందితులను అప్పగించాల్సిందిగా స్థానిక కోర్టును కోరారు. కోర్టు వారెంట్ మంజూరు చేసినా…. జైలు సమయం ముగియడంతో ఇవాళ నిందితులను హైదరాబాద్ తీసుకొని వచ్చారు. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విదిస్తూ న్యాయమూర్తి […]

చంచల్‌గూడ జైల్లో జయరాం హత్య కేసు నిందితులు
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని చిగురుపాటి జయరాం కేసు ఇప్పుడు తెలంగాణ పోలీసుల చేతిలో ఉంది. శనివారం నందిగామ వెళ్లి నిందితులను అప్పగించాల్సిందిగా స్థానిక కోర్టును కోరారు. కోర్టు వారెంట్ మంజూరు చేసినా…. జైలు సమయం ముగియడంతో ఇవాళ నిందితులను హైదరాబాద్ తీసుకొని వచ్చారు.

ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విదిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

జడ్జి ఆదేశాల మేరకు వీరిద్దరినీ చంచల్‌‌గూడ జైలుకు తరలించారు. రేపు వీరి కస్టడీ కోరుతూ హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

గత నెలలో జయరాం హత్య జరిగిన తర్వాత శవం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికింది. దీంతో ఏపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోనికి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. కాగా, జయరాం భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేయడం, హత్య తెలంగాణ పరిధిలో జరగడంతో కేసును ఏపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసులకు బదిలీ చేసింది.

ప్రస్తుతం జయరాం హత్య కేసు విచారణ అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌ ఉన్నారు.

First Published:  11 Feb 2019 9:50 AM GMT
Next Story