వాలంటైన్స్ డే కానుక ఇవ్వనున్న నాని

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని కి ‘కృష్ణార్జున యుద్ధం’ స్పీడ్ బ్రేకర్ లా మారింది. ఆ సినిమా తరువాత విడుదలైన ‘దేవదాస్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇక తాజా గా ‘జెర్సీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ పాత్ర పోషిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ప్రేమికుల రోజు సందర్భంగా ఒక కానుక ఇవ్వనుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఒక పాటను విడుదల చేయనున్నారు. ‘అదేంటోగాని ఉన్నపాటుగా’ అంటూ సాగే ఈ పాట ఫిబ్రవరి 14వ తారీఖున విడుదల కానుంది.

పోస్టర్ లో నవ్వుతూ బండిమీద వెళుతున్నట్టుగా కనిపించిన నాని, ఈ చిత్ర హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ ని చూస్తుంటే ఇది ఒక డ్యూయెట్ అని అనిపిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.