ఫైట్స్ తో  ఫినిష్ చేస్తున్నాడు

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా “మహర్షి”. మహేష్ బాబు 25 వ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే పోలాచ్చి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చిన టీం హైదరాబాద్ లో డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసుకుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు మీద ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి.

ఈ ఫైట్ సీక్వెన్స్ అయిపోగానే మళ్ళీ ఒక చిన్న సెట్ లో మరో  ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తాడట వంశీ. ఈ ఫైట్ సీక్వెన్స్ తో మూవీ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సినిమా సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు స్నేహితుడిగా కామెడీ హీరో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ కానుంది.