ఫస్ట్ ప్రపోస్ చేసింది నమ్రతనేనట

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్నాడటే దానికి కారణం నమ్రత శిరోద్కర్ అని మహేష్ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు కూడా. మహేష్ బాబు షూటింగ్స్ తో బిజీగా ఉండడం…. ఇంటి పనులు, పిల్లల గురించి మహేష్ బాబు టెన్షన్ పడకుండా చూసుకుంటుందట నమ్రత.

నమ్రత లాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం అని మహేష్ బాబు చాలా సందర్భాలలో చెప్పాడు. ఇక ఇప్పుడు నమ్రత వీళ్ళిద్దరి మొదటి ప్రపోసల్ గురించి చెప్పుకొచ్చింది.

ఆ విషయం గురించి నమ్రత మాట్లాడుతూ “వంశీ సినిమా షూటింగ్ కోసం మేమంతా న్యూజిలాండ్ వెళ్లాం. అక్కడ దాదాపు 25 రోజులపాటు షూటింగ్ జరిగింది. మహేష్ బాబు కి చాలా సిగ్గెక్కువ. అయన ఇతరులతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ నాతో బాగానే మాట్లాడేవారు. అప్పటికే మా మధ్య స్నేహం కుదిరింది. న్యూజిలాండ్ నుంచి వచ్చాక ప్రేమలో ఉన్నామని ఇద్దరికీ అర్ధమైంది. మహేష్ కు మొదటగా ఫోన్ లో నేనే ప్రపోస్ చేశా. అప్పటికే తను నాతో ప్రేమలో ఉన్నారు. దాంతో దాదాపు మూడేళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాం” అని తన లైఫ్ లో జరిగిన ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్.