Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబుని టైం కోరిన సుకుమార్

మహేష్ బాబు ప్రస్తుతం “మహర్షి” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మహేష్ బాబు ఓకే చెప్పాడు. ఈ సినిమాకి మహేష్ బాబు ఓకే చెప్పి కొన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కథ ఫైనల్ కాలేదు. మొదట సుకుమార్ […]

మహేష్ బాబుని టైం కోరిన సుకుమార్
X

మహేష్ బాబు ప్రస్తుతం “మహర్షి” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మహేష్ బాబు ఓకే చెప్పాడు.

ఈ సినిమాకి మహేష్ బాబు ఓకే చెప్పి కొన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కథ ఫైనల్ కాలేదు. మొదట సుకుమార్ మహేష్ బాబుకి ఒక లైన్ చెప్పాడు, లైన్ నచ్చిన మహేష్ బాబు…. సుకుమార్ తో ఆ కథ డెవలప్ చేసుకొని రమన్నాడు. తీరా సుకుమార్ ఆ కథ రెడీ చేసుకొని వెళ్ళిన తరువాత మహేష్ కి ఆ కథ నచ్చలేదట.

దీంతో డీలా పడిపోయిన సుకుమార్ ఇప్పుడు మహేశ్ బాబు ని మూడు నెలలు సమయం కోరాడట. ఈ మూడు నెలల్లో సుకుమార్ మరో కొత్త కథ రెడీ చేసుకొని మహేష్ బాబు దగ్గరకి వెళ్లనున్నాడట. మరి ఈ సారి అయినా సుకుమార్…. మహేష్ బాబుకి సెట్ అయ్యే కథ తీసుకొని వెళ్తాడో లేదో చూడాలి.

First Published:  11 Feb 2019 5:40 AM GMT
Next Story