ప్రభాస్ ప్రొడక్షన్ హౌస్ లో నాగ చైతన్య

షార్ట్ ఫిలింస్ చేస్తూ ఇండస్ట్రీ లోకి వచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన తొలి సినిమా “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” సూపర్ హిట్ గా నిలిచి మంచి అవకాశాలు తెచ్చి పెట్టింది. కానీ మేర్లపాక గాంధీ మాత్రం నిధానమే ప్రధానం అన్నట్లుగా రెండేళ్ళ గ్యాప్ తరువాత “ఎక్స్ ప్రెస్ రాజా” అనే సినిమా తీసి రెండో హిట్ అందుకున్నాడు.

ఇక ఆ తరువాత మేర్లపాక గాంధీ మూడో సినిమాగా వచ్చిన “కృష్ణార్జున యుద్ధం” మాత్రం మేర్లపాక గాంధీ కి ఫ్లాప్ ని తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా కూడా మేర్లపాక గాంధీ తన నాలుగో సినిమా స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మేర్లపాక గాంధీ తన తదుపరి సినిమాని నాగ చైతన్య తో చేయాలని భావిస్తున్నాడు.

ఇటీవలే నాగ చైతన్య…. మేర్లపాక గాంధీ చెప్పిన లైన్ విని ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది.

ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తయిన వెంటనే మేర్లపాక గాంధీ సినిమా స్టార్ట్ చేస్తాడట నాగ చైతన్య.