నిహారిక పెళ్లిపై నాగబాబు రియాక్షన్

మెగా డాటర్ నిహారిక కొణెదల పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉంటాయి. వాటిని మెగా కాంపౌండ్ ఖండిస్తూనే ఉంటుంది. నాగశౌర్యతో ఆమె పెళ్లి ఉంటుందంటూ ఆమధ్య తెగ గాసిప్స్ వినిపించాయి. కానీ వాటిని ఎవరూ ధృవీకరించలేదు. ఇదిలా ఉండగా, నిహారిక పెళ్లిపై ఆమె తండ్రి నాగబాబు రియాక్ట్ అయ్యారు.

నిహారిక ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిందని, ప్రస్తుతానికి ఆమె పెళ్లి ఆలోచనలో లేదని స్పష్టం చేశాడు నాగబాబు. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు సంబంధాలు వెదకడం స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తమ కులంలో వ్యక్తి అయితే మంచిదని, ఒకవేళ తమ కులం కాకపోయినా తమకు పెద్దగా పట్టింపులేదని చెప్పుకొచ్చిన నాగబాబు, అసలు నిహారిక వెళ్లి విషయంలో కులం ప్రస్థావన తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ముందు నిహారికకు నచ్చడం ముఖ్యమని, నిహారికకు నచ్చితే మెగా కుటుంబంలో అందరికీ నచ్చినట్టేనని నాగబాబు స్పష్టంచేశాడు. ఇక సాయిధరమ్ తేజ్-నిహారిక రిలేషన్ షిప్ పై స్పందించిన నాగబాబు.. తేజూ వరుసకు నిహారికకు బావ అయినప్పటికీ వాళ్లిద్దరూ అలా పెరగలేదని తెలిపాడు. నిహారిక పెళ్లిపై నాగబాబు ఇంత ఓపెన్ గా స్పందించడం ఇదే ఫస్ట్ టైమ్.