“ఆర్.ఆర్.ఆర్” కోసం ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్….

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ గా వస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని రాజమౌళి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే రామ్ చరణ్ పై తొలి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన రాజమౌళి…. ఇప్పుడు ఎన్టీఆర్ పై షూటింగ్ కి రెడీ అవుతున్నాడట. కానీ ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక నెల టైం పడుతుంది. ఈ లోపు ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. లియోడ్ స్టీఫెన్స్ అనే ఫిజికల్ ట్రైనర్ పర్యవేక్షణ లో ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకోనున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ కంటే కూడా ఎన్టీఆర్ లుక్ చాలా వైవిధ్య భరితంగా ఉండబోతుందట. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ పై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశాడు రాజమౌళి. దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.