ఏపీ ఈ దేశంలో భాగం కాదా?

ఢిల్లీలో చంద్ర‌బాబు చేస్తున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీక్ష శిబిరానికి వ‌చ్చి సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ…ఏ మాత్రం విశ్వ‌స‌నీయ‌త లేని వ్య‌క్తి న‌రేంద్ర మోడీ అని విమ‌ర్శించారు.

ఏప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించి అబ‌ద్దాల‌ను మోడీ చెబుతుంటార‌ని మండిప‌డ్డారు. న‌రేంద్ర మోడీ కాప‌లాదారుడు కాద‌ని… దోపిడి దారుడు అని రాహుల్ వ్యాఖ్యానించారు. మోడీ విభ‌జించి పాలించు సూత్రాన్ని అనుస‌రిస్తున్నార‌ని చెప్పారు.

ప్ర‌త్యేక హోదాపై ఇచ్చిన హామీని ప్ర‌ధాన మంత్రే నిలబెట్టుకోక‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. న‌రేంద్ర మోడీ ప్ర‌జ‌ల సొమ్ము దోచుకుని అంబానీల‌కు క‌ట్ట‌బెట్టార‌ని మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్రదేశ్ దేశంలో భాగం కాదా అని ప్ర‌శ్నించారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం పాట పాడ‌డం మోడీకి అల‌వాటుగా మారింద‌న్నారు.