“వినయ విధేయ రామ”…. నష్టం ఆ రూపంలో భర్తీ చేస్తాడట….

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా “వినయ విధేయ రామ”. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి వచ్చిన నష్టాల విషయంలో బోయపాటి శ్రీనుకి, నిర్మాత దానయ్యకి గొడవ అవుతుందని ఫిలిం నగర్ టాక్.

ఇక రామ్ చరణ్ కూడా ఈ విషయంలో కలగజేసుకుని అయిదు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఈ అయిదు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వట్లేదట. ఎందుకంటే దీని బదులు చిరంజీవి – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చే సినిమా హక్కులు చాలా తక్కువ ధరకి ఇవ్వడానికి చరణ్ రెడీ అయ్యాడు.

కానీ అసలు ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఎప్పుడు పూర్తవుతుంది? అని డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటున్నారు. మొత్తానికి తన సినిమాకి వచ్చిన నష్టాన్ని…. తండ్రి సినిమా పేరు చెప్పుకొని భర్తీ చేయడానికి రెడీ అయ్యాడట రామ్ చరణ్.