కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘పి’…. నీకు బెస్ట్ విషెస్ – రాబర్ట్ వాద్రా!

మొదటిసారిగా క్రీయాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంకగాంధీ. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీకి ఆమె భర్త రాబర్ట్ వాద్రా శుభాకాంక్షలు తెలిపారు. ఈస్ట్ యూపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె లక్నోలో ర్యాలీలో పాల్గొన్నారు.

యూపీలో నాలుగు రోజులపాటు జరగనున్న ఈ ర్యాలీలో ప్రియాంక పాల్గొంటున్నారు. ప్రియాంక రాజకీయ ప్రవేశంతో పాటు ప్రియాంకను పరిపూర్ణ మహిళా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు భర్త రాబర్ట్ వాద్రా. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు సేవచేసేందుకు ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చిందని… తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తిస్తుందన్నారు.

అయితే వాద్రా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ‘పి’ నీకు నా బెస్ట్ విషెస్ అంటూ పోస్ట్ చేశారు. ప్రియాంక నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు….పర్ఫెక్ట్ భార్య కూడా. మా పిల్లలకు బెస్ట్ మదర్ అని వ్యాఖ్యానించారు వాద్రా. కాగా రాబర్ట్ వాద్రాను ప్రియాంక గాంధీ 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రాబర్ట్ వాద్రా అక్రమంగా ఆస్తులు కూడబెట్టరన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు మనీ లాండరింగ్ కేసులో వాద్రా ఈడీ ముందు విచారణకు హాజరవుతున్నారు.

My Best wishes to you P, on your new journey of working in Uttar Pradesh and serving the people of India. You have been…

Posted by Robert Vadra on Monday, 11 February 2019