విజయవాడలో విచిత్ర దృశ్యం

విజయవాడ నుంచి గన్నవరం వెళ్తున్న మార్గంలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడుతోంది. వాహనదారులు, బాటసారులు ఒక్క క్షణం ఆగి ఇది నిజమేనా అని విచిత్రంగా చూస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే.. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ కటౌట్లు మూడు వరుసగా పెట్టి ఉన్నాయి.

వీరు ముగ్గురూ కలసి ఏదైనా సభ ఏర్పాటు చేస్తున్నారా..? అనే అనుమానం కూడా రాకమానదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వారి కటౌట్లు ఎందుకిలా ఉన్నాయని గమనిస్తే వారికి అసలు విషయం బోధపడింది.

అక్కడ ఒక ఫ్లెక్సీ దుకాణం ఉంది. వారి ప్రచారం కోసం ఇలా ముగ్గురి కటౌట్లు వరుసగా పెట్టారు. దీన్ని జనం ఆశ్చర్యంగా చూడటం గమనార్హం. ‘ఎక్కడైనా ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి కటౌట్‌లు చేయించుకుంటాయా… విడ్డూరం కాకపోతే..’ అని చలోక్తులు విసురుకుంటూ వెళ్తున్నారు.