చంద్ర‌బాబు నా పెద్ద‌కొడుకు, జ‌గ‌న్ నా చిన్న కొడుకు – యామిని సాదినేని

టీడీపీ అధికార ప్ర‌తినిధి మామిని సాదినేని ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ వ‌ద్ద సందడి చేశారు. చంద్ర‌బాబు దీక్ష చేస్తున్న చోట తెలుగు త‌ల్లి వేషం వేసుకుని యామిని అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు. త‌న‌కు తాను తెలుగు త‌ల్లిగా ప‌రిచ‌యం చేసుకుని మీడియాతో మాట్లాడారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అహంకారం త‌ల‌కెక్కింద‌ని… దాన్ని దించుతామ‌న్నారు. ఒక తెలుగు త‌ల్లిగా తాను చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు. త‌న పెద్ద‌కొడుకు చంద్ర‌బాబు 68 ఏళ్ల వ‌య‌సులోనూ 18 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని… త‌న చిన్న కొడుకు జ‌గ‌న్ మాత్రం కేవ‌లం ముఖ్య‌మంత్రి సీటు కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

మోడీ రాజ‌కీయ క‌క్ష పెంచుకుని ప‌నిచేస్తున్నార‌ని యామిని విమ‌ర్శించారు. మోడీ వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించార‌న్నారు. హోదాపై టీడీపీ ఎన్న‌డూ యూ ట‌ర్న్ తీసుకోలేద‌ని చెప్పారు.

తెలుగు త‌ల్లి వేషం వేసుకుని సంద‌డి చేసిన యామిని సాదినేని దీక్ష‌కు వ‌చ్చిన వారిని ఆక‌ట్టుకున్నారు. సాదినేని వేషం వేశార‌ని తెలుసుకుని చాలా మంది దీక్ష శిబిరం నుంచి ఆమెను చూసేందుకు వెళ్లారు.