యాత్ర ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమాకు డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. 18 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ, నైజాంలో ఫస్ట్ వీకెండ్ లో యాత్ర సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.50 కోట్లు
సీడెడ్ – రూ. 0.96 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.40 కోట్లు
ఈస్ట్ – రూ. 0.22 కోట్లు
వెస్ట్ – రూ. 0.29 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 0.41 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు