అనంతపురం సమర శంఖారావం సభలో జగన్ కామెంట్స్

* నా 9 ఏళ్ళ ఈ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాను. అండగా ఉంటాను. 5 ఏళ్ళ కాలంలో.. రాప్తాడులో వైయస్ఆర్సీపీ శ్రేణులపై 1280 అక్రమ కేసులు పెట్టారు. అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ ఉపసంహరిస్తా. మనం రాక్షసులతో, అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్నమోసగాళ్ళతో యుద్ధం చేస్తున్నాం.. అని ఎవరూ మరచిపోవద్దు.

* రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు చేర్చారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి- మనకు తేడా కేవలం 5లక్షలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

* మనం పోరాటం చేస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడుతో మాత్రమే కాదు. ఎల్లో మీడియాతో కూడా పోరాటం చేస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో మనం యుద్ధం చేస్తున్నాం అన్న విషయాన్ని మీరు మరచిపోవద్దు.

* ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు డబ్బుల మూటలు పంపిస్తున్నారు. ప్రతి ఓటరు చేతిలోనూ రూ. 3వేలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే 3 వేల రూపాయల డబ్బుకు మోసపోవద్దు.. రేపు మన ప్రభుత్వం వస్తుంది.. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే.. మన పిల్లలను బడికి పంపిస్తే.. ఏడాదికి రూ. 15 వేలు అమ్మఒడి ద్వారా ఇస్తారని ప్రతి ఒక్కరికీ చెప్పండి.

* 45 ఏళ్ళు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల చేతుల్లో నాలుగు దఫాలుగా రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి.

* పెన్షన్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.

* మన పిల్లల చదువులకు ఎన్ని లక్షలైనా మన అన్న చూసుకుంటాడని చెప్పండి.

* ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా.. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే.. ఆ వైద్య ఖర్చులన్నీ అన్న ఇస్తాడని చెప్పండి.
* చంద్రబాబు రూ. 3 వేలు ఇస్తానంటే రూ. 5 వేలు అడగండి. డబ్బులు తీసుకొని ఒక్క సెకను దేవుడ్ని స్మరించుకొని మనస్సాక్షిగా ఓటు వేయండి.

* ఈరోజు పోలీసులు గ్రామాల్లోకి వచ్చి… ఎవరు 50 నుంచి 500 ఓట్లు ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసి, ఆ లిస్టులు చంద్రబాబు చేతిలో పెట్టి, ఆ అధికారుల ద్వారా వైయస్ఆర్ సీపీ గ్రామ స్థాయి నాయకుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. మీరంతా అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బులకు ఎవరూ అమ్ముడుపోవద్దు.

* సీ-విజిల్ అని ఎన్నికల సంఘం ఒక యాప్ తయారు చేసింది. ఇది ప్రతి ఒక్కరూ మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నేతలు ఎటువంటి అన్యాయం, అక్రమాలు చేసినా.. వాటినన్నింటినీ రికార్డు చేసి.. ఎన్నికల కమిషన్ కు పంపండి. 100 నిమిషాల్లోనే ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలని చట్టమే చెబుతోంది.

* చంద్రబాబు నాయుడు పాలన మూడు సినిమాలతో పోల్చి చెప్పండి…

మొదటి సినిమా

2014 ఎన్నికలలో చంద్రబాబు హామీలు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచిత విద్య. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం-లేకపోతే నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీసీ నోటిఫికేషన్లు- ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రతి ఇంటికి రూ. 2 కే 20 లీటర్లు మంచినీరు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు-15 ఏళ్ళు కావాలి. ప్రతి కులానికీ మేనిఫెస్ట్లోలో ఒక పేపరు పెట్టి… వాల్మీకి, కురుమలను ఎస్టీలుగా చేస్తానని, రజకులను ఎస్సీలుగా చేస్తానని, గాండ్లను ఎస్సీలుగా చేస్తానని, మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేరుస్తానని కులానికో పేజి పెట్టి మోసం చేయడానికి వెనుకాడలేదు.

మూడేళ్ళలోనే పోలవరం పూర్తి, ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సాయం. ఆంధ్ర రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తెస్తానన్నాడు….వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అమలు చేయలేదు సరికదా.. మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అన్నింటిలో ఎక్కడికక్కడ దోచేశాడు.

రెండో సినిమా

నాలుగేళ్ళు బీజేపీ-పవన్ కళ్యాణ్ తో కాపురం చేసి…. ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని యుద్ధం-పోరాటం అంటాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మూడు నెలల కోసం.. పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాడు. బీజేపీతో చిలక-గోరింకల్లా కాపురం చేస్తాడు.

నాలుగేళ్ళు చంద్రబాబు బీజేపీ నేతలను, బీజేపీ నేతలు చంద్రబాబును పొగిడారు. ప్రత్యక హోదా సంజీవనా? అని అడుగుతాడు. కేసులు పెట్టిస్తాడు. మోడీని పొగుడుతూ జనవరి 27, 2017న మోడీ మన రాష్ట్రానికి చేసినట్టుగా ఏ రాష్ట్రానికైనా చేశాడా? అని ప్రతిపక్షాలకు సవాల్ విసురుతాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీతో విడాకులు తీసుకొని.. నల్లచొక్కా వేసుకొని ఢిల్లీకి పోయి.. పార్లమెంటు ముగిసిపోయిన తర్వాత దీక్ష చేస్తాడు.

ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు-కుంకుమ అంటాడు. రైతు రుణ మాఫీ ఇంకా పూర్తి కాలేదు. 4,5వ విడత రుణాల సంగతి దేవుడెరుగు.. అన్నదాతా సుఖీ భవ అంటాడు.

రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టడు. రాజధాని ఎక్కడ అని అడిగితే బాహుబలి సినిమా చూశారా? సినిమాలో సెట్టింగులు బాగున్నాయా? అని ఎదురు ప్రశ్న వేస్తాడు.

ఎన్నికల ముందు ఆరవ బడ్జెట్ పెడతాడు. రాని బడ్జెట్… ఎన్నికలకు మూడు నెలల ముందు నిరుద్యోగ భృతి వెయ్యి చేస్తాడు.

అవ్వా తాతలకు జగన్ చెప్పాడు కాబట్టి… వారికి పెన్షన్ 2 వేలు అన్నాడు. ఆటోలు, ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తానని జగన్ చెప్పాడు కాబట్టి.. నేనూ ఇస్తానంటాడు. ఆటో డ్రైవర్ దగ్గర ఖాకీ చొక్క గుంజుకోవడం వేసుకోవడం చేస్తాడు.

ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రతి కులంలో పారదర్శకంగా న్యాయం చేస్తామని, ప్రతి అక్కకు రూ. 75 వేలు ఇస్తానని జగన్ చెప్పాడు కాబట్టి.. ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రతి కులాలకు కార్పొరేషన్ అని ప్రకటన. తన హయాంలో రాని బడ్జెట్ లో కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాడు.

బీసీలకు 2014లో ఇచ్చిన 119 హామీలకు దిక్కులేదు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ఇస్తాడు.
57 నెలలు కడుపు మాడ్చి.. చివరి మూడు నెలల్లో ఇవన్నీ పెడతామంటే .. ఆ మనిషిని మీరు అన్న అంటారా? దున్న అంటారా?.

చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కొత్త సినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా ఉన్నాయి. కాపీ కొట్టడం కూడా చేతగాని మనిషి. కాపీ కొట్టేవాడ్ని కాపీ రాయుడు అంటాడు. ఈ పెద్ద మనిషి కనీసం జగన్ దగ్గర కాపీ కొట్టడం కూడా చేతగాని మనిషి.

1983లో ఎన్టీఆర్ కొత్తగా రాజకీయాల్లో అడుగు పెట్టి రూ. 2లకే కిలో బియ్యం ప్రకటించాడు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయ భాస్కర రెడ్డి.. అటూ ఇటూగా చంద్రబాబు మాదిరిగానే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రూ. 1.90కే బియ్యం ఇచ్చారు. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు. రేపు చంద్రబాబు నాయుడుకు కూడా ఇదే జరగబోతోంది.

ఒక రాక్షసుడు పంచభక్ష పరమాణ్ణాలు తయారు చేసి అందర్నీ భోజనానికి పిలుస్తాడు. మనకు తినిపించటానికి కాదు.. అక్కడికి వెళితే మనల్ని భోంచేయడానికి రాక్షసుడు పిలిచినట్టే.. చంద్రబాబు నాయుడు కూడా అంతే.

మూడో సినిమా

కేవలం వారం ముందు తీసిన సినిమా. అది ఆరవ బడ్జెట్ సినిమా. ఏ ముఖ్యమంత్రి అయినా 5 బడ్జెట్లు ప్రవేశ పెడతారు. రూ. 2 లక్షల 26 వేల కోట్లతో ఆరవ బడ్జెట్ పెట్టి.. జగన్ పథకాలను సగం సగం కాపీ కొట్టాడు. మూడు నెలలు ఆగండి.. మనందరి ప్రభుత్వంలో గొప్పగా సంక్షేమ పథకాలు వస్తాయి.. మన జీవితాలను మారుస్తాయి.. అని చెప్పండి అని జగన్‌ అనంతపురం సభలో చెప్పారు.