తీర్పులు ఎలా ఉండాలో కూడా మీడియా చెబుతోంది….

ఇటీవలి కాలంలో కొన్ని మీడియా సంస్థలు అన్ని రంగాల మీద పెత్తనం చేసినట్లే న్యాయవ్యవస్థ మీద కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని, ఏదైనా జరిగితే ఆ విషయంలో తీర్పు ఎలా ఉండాలో కూడా వాళ్ళే ముందుగా చెప్పేస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రి అన్నారు.

గతంలో కోర్టుల వ్యవహారాల్లో మీడియా జోక్యం చేసుకునేది కాదని, మహా అయితే తీర్పు వచ్చాక దాని మీద చాలా నర్మగర్భంగా కామెంట్‌ చేసేది తప్ప ఇప్పటిలాగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను బదనాం చేసే పద్ధతి లేదన్నారు. అసలు కేసు కోర్టు గుమ్మం ఎక్కకముందే ఆ కేసులో తీర్పు ఎలా ఉండాలో మీడియా నిర్ణయించేస్తుందని అన్నారు. తీర్పు ఎలా ఉండాలి? అనే దానిమీద చర్చలు కూడా నిర్వహించేస్తున్నారని చెప్పారు.

తీర్పు వచ్చాక కూడా న్యాయమూర్తులకు లేనిపోని విషయాలు ఆపాదించి ఆ తీర్పు పై కామెంట్‌ చేస్తూ న్యాయమూర్తులను బదనాం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో లా అసోసియేషన్‌
నిర్వహించిన ఒక కార్యక్రమంలో న్యాయమూర్తి సిక్రి ఈ అభిప్రాయాలను వెల్లడించారు.