ప్రియుడి ముందే అత్యాచారం, ఆపై హ‌త్య‌…. స్టేడియంలో అమానుషం

గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మంగ‌ళ‌గిరి మండ‌లం న‌వులూరులోని అమ‌రావ‌తి స్టేడియం వ‌ద్ద ప్రేమ జంట‌పై దాడి జ‌రిగింది. స్డేడియంలోనే కొంద‌రు దుండ‌గులు ప్రేమ జంట‌పై దాడి చేసి ప్రియుడి ముందే అమ్మాయిపై అత్యాచారం చేశారు. ఆపై ఆమెను దారుణంగా చంపేశారు.

తాడేప‌ల్లికి చెందిన చుంచు శ్రీనివాస‌రావు, అంగ‌డి జ్యోతిలు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. స‌ర్టిఫికేట్ల కోసం గుంటూరు వెళ్తున్న‌ట్టు ఇంట్లో చెప్పి జ్యోతి వెళ్లింది. ఆ త‌ర్వాత శ్రీనివాస‌రావును క‌లుసుకుంది. ఇద్ద‌రూ రాత్రి అమ‌రావ‌తి స్డేడియానికి చేరుకున్నారు. వారు అక్క‌డ ఉండ‌డాన్ని గ‌మ‌నించిన కొంద‌రు దుండ‌గులు దాడికి తెగ‌బ‌డ్డారు.

ఆమెపై అక్క‌డే గ్యాంగ్ రేప్ చేశారు. ప్ర‌తిఘ‌టించ‌డంతో రాడ్ల‌తో కొట్ట‌గా ఆమె ప్రాణాలు కోల్పోయింది. శ్రీనివాస‌రావు త‌ల‌ ప‌గిలింది. బాధితుల కేక‌లు విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీసులు వ‌చ్చే స‌రికే జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీనివాస‌రావును ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. హంత‌కుల‌ను ప‌ట్టుకునేందుకు
ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు.