అనుపమ డెబ్యూ అదిరింది

అదేంటి.. అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీకొచ్చి చాన్నాళ్లయింది కదా, చాలా సినిమాలు చేసింది కదా.. మరి ఇప్పుడు డెబ్యూ ఏంటని అనుకుంటున్నారా.? ఇది టాలీవుడ్ డెబ్యూ కాదు. శాండిల్ వుడ్ డెబ్యూ. అవును.. కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్, తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది.

శాండిల్ వుడ్ లో పునీత్ రాజ్ కుమార్ సరసన అనుపమ చేసిన నటసార్వభౌమ అనే సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. గతవారం విడుదలైన ఈ యాక్షన్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి తోడు పునీత్ స్టార్ డమ్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా హిట్ అయింది. అలా డెబ్యూ మూవీతోనే హిట్ హీరోయిన్ అనిపించుకుంది అనుపమ పరమేశ్వరన్.

ఈ హీరోయిన్ ఎప్పుడూ ఇంతే. మలయాళంలో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే (ప్రేమమ్) హిట్ కొట్టింది. ఇటు తెలుగులో కూడా డెబ్యూ మూవీ (అ..ఆ)తో హిట్ కొట్టింది. ఇప్పుడు కన్నడనాట కూడా తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది అనుపమ.

అంతా బాగానే ఉంది కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోతోంది ఈ మల్లూ భామ. మలయాళంలో ఆమెకు అవకాశాలు తగ్గింపోయాయి. తెలుగులో గతేడాది 3 ఫ్లాపులు రావడంతో ఇక్కడ కూడా ఆమెకు నో ఛాన్స్. కనీసం శాండిల్ వుడ్ లోనైనా ఈ పిల్ల పాతుకుపోతే బాగుణ్ణు.