వీరారెడ్డిగా జగపతి బాబు

సైరా నుంచి ఫస్ట్ లుక్స్ కొత్త కాదు. ఇప్పటికే ఎన్నో ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి. ఇప్పుడు వీటికి అదనంగా జగపతి బాబు లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో జగ్గూ భాయ్ కూడా నటిస్తున్నాడనే విషయం చాలామందికి తెలీదు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగపతిబాబు లుక్ ను విడుదల చేశారు.

సైరా సినిమాలో వీరారెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు జగపతిబాబు. జగపతిబాబు లుక్ బాగుంది. చూడ్డానికి రాయల్ గా కూడా ఉంది. అది ఒక ప్రాంతానికి చెందిన రాజు పాత్ర అనే విషయం అర్థమౌతూనే ఉంది. కాకపోతే సినిమాలో అది పాజిటిక్ క్యారెక్టరా లేక విలన్ పాత్రా అనే విషయాన్ని మాత్రం యూనిట్ వెల్లడించలేదు.

జగపతిబాబు ఇప్పుడు అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు. ఏ సినిమాలో పాజిటివ్ గా కనిపిస్తాడో, ఏ సినిమాలో నెగెటివ్ గా కనిపిస్తాడో చెప్పడం చాలా కష్టంగా మారింది. అందుకే సైరాలో కూడా అతడి పాత్ర స్వభావం ఏంటనేది లుక్ చూసి చెప్పడం యమ కష్టంగా తయారైంది. త్వరలోనే దీనిపై సైరా యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.