కుంప‌టి కింద పెట్టుకుని ప‌డుకున్నాడు…. ఆ త‌ర్వాత‌….

తూర్పుగోదావ‌రి జిల్లా మామిడికుదురు మండ‌లంలో ఒక వృద్ధుడిని నిప్పుల కుంప‌టి బ‌లిగొంది. పెద‌ప‌ట్నంలో పిల్లి వాడిప‌ల్లి అనే 70 ఏళ్ల వృద్ధుడు నిప్పుల కుంప‌టి కార‌ణంగా స‌జీవ‌ద‌హ‌నం అయ్యాడు. రాత్రి చ‌లి ఎక్కువ‌గా ఉండ‌డంతో పూరింట్లో నిప్పుల కుంప‌టి రాజేసి… దాన్ని మంచం కింద పెట్టుకుని ప‌డుకున్నాడు వృద్ధుడు.

తెల్ల‌వారుజామున నిప్పుల కుంప‌టి నుంచి నిప్పు ర‌వ్వ‌లు ఎగ‌సిప‌డ‌డంతో గుడిసె అంటుకుంది. నిద్ర‌లో ఉన్న వృద్థుడు బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు. క్ష‌ణాల్లో గుడిసె మొత్తం కాలిపోయింది. ఫైర్ ఇంజన్ వ‌చ్చే లోపే అంతా అయిపోయింది. వృద్ధుడు స‌జీవద‌హ‌నం అయ్యాడు. ప‌క్క‌నే ఉన్న పూరింటికి కూడా మంట‌లు అంటుకుని అదీ కాలిపోయింది. అప్ప‌టికే స్థానికులు అప్ర‌మ‌త్తం అవ‌డంతో ఇత‌రులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు.