పార్లమెంటు వద్ద హై అలర్ట్

పార్లమెంటు వద్ద ఒక కారు బారికేడ్ల మీదకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది హై అలర్ట్ ప్రకటించారు.

మణిపూర్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు థాక్‌చమ్ మేయిన‌కు చెందిన కారుగా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన యాదృశ్చికంగా జరిగిందా లేదా కావాలనే చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇదేమైనా ఈ ఘటనకు కారణమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.