ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య్ బాపినీడు మృతి

ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు విజ‌య్ బాపినీడు క‌న్నుమూశారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు విజ‌య్ బాపినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌గ‌ధీరుడు, గ్యాంగ్ లీడ‌ర్‌, ప‌ట్నంలో ప‌తివ్ర‌త‌లు, మ‌గ‌మ‌హారాజు, మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు, ఖైదీనెంబ‌ర్ 786, డ‌బ్బు డ‌బ్బు డ‌బ్బు, నాకు పెళ్లాం కావాలి, బిగ్ బాస్‌…. వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

విజయ బాపినీడు జర్నలిస్టు కూడా. ఆయన పలు పత్రికలు కూడా నడిపారు. ముఖ్యంగా విజయ అనే మాస పత్రికను చాలా కాలం పాటు విజయవంతంగా నిర్వహించారు.

‘య‌వ్వ‌నం కాటేసింది’ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 22  చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈయ‌న అస‌లు పేరు బాపినీడు చౌద‌రి.

1936 సెప్టెంబ‌ర్ 22న జ‌న్మించారు. హైద‌రాబాద్‌లోని సొంతింటిలో తుది శ్వాస విడిచారు. ఈయ‌న‌ సొంతూరు ఏలూరు స‌మీపంలోని చాట‌ప‌ర్రు గ్రామం. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 82 ఏళ్లు. విజ‌య్ బాపినీడు మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.