Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండ సినిమా రీ షూట్ అవుతుంది

ఇండస్ట్రీ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న భరత్ కమ్మ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఔట్ పుట్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తి వ్యక్తం చేసాడని […]

విజయ్ దేవరకొండ సినిమా రీ షూట్ అవుతుంది
X

ఇండస్ట్రీ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న భరత్ కమ్మ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఔట్ పుట్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తి వ్యక్తం చేసాడని తెలుస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్ విజయ్ దేవరకొండ కి అంత ఎమోషనల్ గా అనిపించలేదట. అందుకే ఆ సీన్స్ ని విజయ్ దేవరకొండ మళ్ళీ రీ షూట్ చేయమని సూచించాడట.

ఇక ప్రొడ్యూసర్స్ కూడా నో చెప్పకుండా సీన్స్ రీ షూట్ చేయడానికి రెడీ అయ్యారట. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

First Published:  12 Feb 2019 11:28 PM GMT
Next Story