Telugu Global
NEWS

జయరాం శవాన్ని కారులో వేసుకొని హైదరాబాద్ అంతా తిరిగిన నిందితుడు..!

ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణ హైదరాబాద్ పోలీసులు చేపట్టిన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసు కస్టడీకి ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, డ్రైవర్ శ్రీనివాసరెడ్డి వచ్చాక దర్యాప్తు అధికారి శ్రీనివాస్ వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. రాకేష్ రెడ్డి ఇంట్లో హత్య జరిగిన తర్వాత అతనితో సన్నిహితంగా ఉండే పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశాడని… ఆ తర్వాత వారి సలహా మేరకే ఏపీలోని నందిగామ పరిసరాల్లో శవాన్ని పడేశాడని […]

జయరాం శవాన్ని కారులో వేసుకొని హైదరాబాద్ అంతా తిరిగిన నిందితుడు..!
X

ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణ హైదరాబాద్ పోలీసులు చేపట్టిన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసు కస్టడీకి ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, డ్రైవర్ శ్రీనివాసరెడ్డి వచ్చాక దర్యాప్తు అధికారి శ్రీనివాస్ వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

రాకేష్ రెడ్డి ఇంట్లో హత్య జరిగిన తర్వాత అతనితో సన్నిహితంగా ఉండే పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశాడని… ఆ తర్వాత వారి సలహా మేరకే ఏపీలోని నందిగామ పరిసరాల్లో శవాన్ని పడేశాడని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే హత్య జరిగిన తర్వాత రాకేష్ రెడ్డి శవాన్ని కారులో పెట్టుకొని నగరంలో తిరిగినట్లు విచారణలో తెలిపినట్లు సమాచారం. ఉదయం చనిపోతే సాయంత్రం నాలుగు గంటలకు నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు చెప్పాడు.

అదే రోజు సీఐ శ్రీనివాస్‌కు, ఏసీపీ మల్లారెడ్డికి కాల్ చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. వారిద్దరి సలహా మేరకే ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిందితుడు చెప్పాడు.

First Published:  13 Feb 2019 12:53 PM GMT
Next Story