Telugu Global
Cinema & Entertainment

మెహ్రిన్ తో మరోసారి....

నాని “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో వైపు విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా సైన్ చేసాడట నాని. ఒక కొత్త డైరెక్టర్ ని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నాడట నాని. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రిన్ ని తీసుకోబోతున్నారట. ఇప్పటికే నాని, మెహ్రిన్ “క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ” సినిమాలో నటించారు. […]

మెహ్రిన్ తో మరోసారి....
X

నాని “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో వైపు విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా సైన్ చేసాడట నాని. ఒక కొత్త డైరెక్టర్ ని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నాడట నాని. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రిన్ ని తీసుకోబోతున్నారట.

ఇప్పటికే నాని, మెహ్రిన్ “క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ” సినిమాలో నటించారు. ఆ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కి మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ వర్క్ అవుట్ అవ్వాలన్న ఆలోచనతో మెహ్రిన్ ని హీరోయిన్ గా రిపీట్ చేస్తున్నాడట నాని. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

ఇకపోతే నాని నటిస్తున్న “జెర్సీ” సినిమా ఏప్రిల్ 5 న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే విక్రం కే కుమార్ సినిమా షూటింగ్ తో బిజీ అవుతాడు నాని.

First Published:  13 Feb 2019 3:41 AM GMT
Next Story