Telugu Global
Cinema & Entertainment

పోలీస్ ఆఫీసర్ గా.... హాట్ బ్యూటీ....

ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటించిన తరువాతే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సాహసం చేశారు. నయనతార, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం తను నటించిన తొలి సినిమా తరువాతే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ కొట్టేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు “ఆర్ ఎక్స్ 100” సినిమాతో యువత మనసు దోచేసిన పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాలోనే […]

పోలీస్ ఆఫీసర్ గా.... హాట్ బ్యూటీ....
X

ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటించిన తరువాతే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సాహసం చేశారు. నయనతార, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు.

కానీ ఒక్క హీరోయిన్ మాత్రం తను నటించిన తొలి సినిమా తరువాతే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ కొట్టేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు “ఆర్ ఎక్స్ 100” సినిమాతో యువత మనసు దోచేసిన పాయల్ రాజ్ పుత్.

తొలి సినిమాలోనే అందాలు ఆరబోసిన ఈ భామ ప్రస్తుతం రవితేజ సరసన “డిస్కో రాజా” సినిమాలో నటిస్తుంది. వి.ఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తరువాత పాయల్ రాజ్ పుత్…. ప్రనదీప్ అనే దర్శకుడి దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతుంది.

ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తుంది. ఈ పాత్ర కోసం ఇప్పటి నుంచే జిం లో టైం స్పెండ్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

First Published:  13 Feb 2019 12:29 AM GMT
Next Story