Telugu Global
Cinema & Entertainment

నిర్మాతగా మారబోతున్న హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” వంటి సినిమాని డైరెక్ట్ చేసి హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో “వాల్మీకి” అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఒక చిన్న సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్…. నిర్మాతగా మారాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. కానీ తనకి ఉన్న కమిట్ […]

నిర్మాతగా మారబోతున్న హరీష్ శంకర్
X

పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” వంటి సినిమాని డైరెక్ట్ చేసి హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో “వాల్మీకి” అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఒక చిన్న సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

హరీష్ శంకర్…. నిర్మాతగా మారాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. కానీ తనకి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అది కుదరడం లేదట. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట హరీష్ శంకర్.

ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై సినిమాలు నిర్మిస్తున్న మహేష్ ఎస్ కోనేరు హరీష్ శంకర్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటాడు. తను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకి తనే రచన సహకారం అందిస్తాడట. అతి త్వరలో తన ప్రొడక్షన్ పేరు ని ప్రకటించి అందులో చేయబోయే సినిమా తాలూకు వివరాలు ప్రకటిస్తాడట హరీష్ శంకర్. దీన్ని బట్టి చూస్తుంటే హరీష్ శంకర్ తన ఫేవరెట్ డైరెక్టర్ అయిన సుకుమార్ ని ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది.

First Published:  13 Feb 2019 7:00 AM GMT
Next Story