Telugu Global
Cinema & Entertainment

మెగా మేనల్లుడికి విలన్ గా తమిళ్ హీరో ?

సాయి ధరం తేజ్ తమ్ముడు  వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఇటీవలే ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్యూర్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బెస్తవాళ్ళ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో […]

మెగా మేనల్లుడికి విలన్ గా తమిళ్ హీరో ?
X

సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఇటీవలే ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్యూర్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బెస్తవాళ్ళ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ఉందట. అయితే ఆ క్యారెక్టర్ కోసం తమిళ హీరో విజయ్ సేతుపతి ని తీసుకోవాలని అనుకుంటున్నారట నిర్మాతలు.

కానీ విజయ్ సేతుపతి నటన ముందు వైష్ణవ్ తేజ్ తట్టుకోగలడా అనే డౌట్ ఇప్పుడు అందరిలో మొదలైంది. ఒకవేళ విజయ్ సేతుపతి గాని ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  13 Feb 2019 1:53 AM GMT
Next Story