వాణి విశ్వ‌నాథ్ ఎక్క‌డ? చ‌ంద్ర‌బాబు తాజా క‌రివేపాకులు వీళ్లేనా ?

ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో కొంద‌రు ఎలివేట్ అయ్యారు. మ‌రికొంద‌రు జోక‌ర్లుగా మారారు. అయితే ఈ ధ‌ర్నాలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్ల మ‌ధ్య ఒక చ‌ర్చ న‌డిచింది. స్టేజీ మీద వీర ఆవేశంతో ఊరేగిపోతున్న కొంద‌రు న‌టుల‌ను చూసి వీళ్లంతా న‌వ్వుకోవ‌డం క‌నిపించింది.

మా చంద్ర‌బాబు తాజా క‌రివేపాకులు వీళ్లే అంటూ వారంత జోకులు పేల్చ‌డం క‌నిపించింది. మా బాబుగారి వాడ‌కం గురించి ఇంకా వీళ్ల‌కు తెలియ‌దు అంటూ వారు సెటైర్లు విసిరారు. చంద్రబాబు పాత క‌రివేపాకుల సంగ‌తి తెలుసుకుంటే వీళ్లు మైకుల ముందు ఇలా ఊగిపోరని వారు సెల‌విచ్చారు.

న‌గ‌రి నియోజ‌క‌వర్గ‌మే కాదు…. వైసీపీ త‌రపున బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్న ఎమ్మెల్యే రోజాను ఎదుర్కొనేందుకు టీడీపీ చాలా మంది లేడీస్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. కానీ వారు ఎక్కువ‌కాలం స్క్రీన్ లపై ఉండ‌లేక‌పోయారు. పీత‌ల సుజాత‌, ఎమ్మెల్యే అనిత ఇప్పుడు అడ్ర‌స్ లేకుండా పోయారు.

ఆత‌ర్వాత గ్లామ‌ర్‌ను గ్లామ‌ర్‌తోనే దెబ్బ‌కొట్టాల‌ని అల‌నాటి హీరోయిన్ వాణి విశ్వ‌నాథ్‌ను స్క్రీన్‌ పైకి తీసుకొచ్చారు. ఆమె టీడీపీలో చేర‌తార‌ని…. న‌గ‌రి నుంచి రోజాపై పోటీ చేస్తార‌ని ప్ర‌చారం చేయించారు. తీరా చూస్తే ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ లేకుండా పోయింది. టీడీపీ నేత‌ల గురించి పూర్తిగా తెలుసుకున్న ఆమె పార్టీలో చేరేది లేద‌ని చెప్పేశార‌ట‌. దీంతో ఆమె ఆ త‌ర్వాత మీడియాలో క‌నిపించడ‌మే మానేశారు.

ఆ త‌ర్వాత వెతికి వెతికి ఈ మ‌ధ్య‌లోనే అక్క‌డ‌క్క‌డా సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్న దివ్య‌వాణిని ప‌ట్టుకొచ్చారు. కానీ ఆమె కూడా నోరు పారేసుకున్నారు. కానీ జ‌నాల‌ను ఆక‌ట్టులేక‌పోయారు. అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తున్న యామిని, రేవ‌తి చౌద‌రిలు గ్లామ‌ర్ బొమ్మ‌లుగా క‌నిపిస్తున్నారు. వారి మాట‌ల‌ను జ‌నం ప‌ట్టించుకోవడం లేదు.

వీరే కాదు సినిమాలు లేని శివాజీ, ఏపీ మేధావి సంఘం ప్ర‌తినిధి చ‌ల‌సాని శ్రీనివాస్‌తో పాటు జ‌ర్న‌లిస్టు సంఘాల పేరుతో చ‌లామ‌ణీ అవుతున్న కొంద‌రు నేత‌లు ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు క‌రివేపాకు లిస్ట్‌లో చేరారు. త‌మ‌కు ఏదో సీటు ఇస్తార‌నే ఆశ‌తో వీరు ఉన్నార‌ని…కానీ ఎన్నిక‌ల సీజ‌న్ ముగిస్తే చంద్ర‌బాబు వాడ‌కం ఏంటో వీళ్ల‌కు తెలుస్తుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు.