Telugu Global
NEWS

నిజమైన ప్రేమకు సరిహద్దులు లేవంటున్న క్రికెటర్లు

మతాలు, దేశాలకు అతీతంగా క్రికెటర్ల ప్రేమ జెంటిల్మన్ గేమ్ లో గ్లోబల్ లవ్ హద్దులు, సరిహద్దులు చేరిపేసిన క్రికెటర్ ప్రేమికులు నిజమైన ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనేలేవు. దేశాలకు, ఖండాలకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నా…క్రికెటర్ల ప్రేమకు మాత్రం హద్దులు, సరిహద్దులు లేనేలేవని వివిధ తరాలకు చెందిన క్రికెటర్ల ప్రేమను చూస్తేనే ఇట్టే అర్ధమైపోతుంది. ఇక్కడి అమ్మాయి…అక్కడి అబ్బాయి, అక్కడి ఇమ్మాయి…ఇక్కడి అమ్మాయి లాంటి క్రికెట్ ప్రేమజంటలు ఎందరో… ఎందరెందరో…. క్రికెట్…మూడక్షరాల ఆట. ప్రేమ రెండక్షరాల మాట. క్రికెటర్ల ఆటకు […]

నిజమైన ప్రేమకు సరిహద్దులు లేవంటున్న క్రికెటర్లు
X
  • మతాలు, దేశాలకు అతీతంగా క్రికెటర్ల ప్రేమ
  • జెంటిల్మన్ గేమ్ లో గ్లోబల్ లవ్
  • హద్దులు, సరిహద్దులు చేరిపేసిన క్రికెటర్ ప్రేమికులు

నిజమైన ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనేలేవు. దేశాలకు, ఖండాలకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నా…క్రికెటర్ల ప్రేమకు మాత్రం హద్దులు, సరిహద్దులు లేనేలేవని వివిధ తరాలకు చెందిన క్రికెటర్ల ప్రేమను చూస్తేనే ఇట్టే అర్ధమైపోతుంది. ఇక్కడి అమ్మాయి…అక్కడి అబ్బాయి, అక్కడి ఇమ్మాయి…ఇక్కడి అమ్మాయి లాంటి క్రికెట్ ప్రేమజంటలు ఎందరో… ఎందరెందరో….

క్రికెట్…మూడక్షరాల ఆట. ప్రేమ రెండక్షరాల మాట. క్రికెటర్ల ఆటకు ప్రేమికుల సయ్యాటకు ఏదో తెలియని అవినాభావ సంబంధమే ఉంది. ఓ భారత యువతిని ఓ న్యూజిలాండ్ క్రికెటర్ ప్రేమిస్తే….ఓ న్యూజిలాండ్ అమ్మాయిని ఓ భారత క్రికెటర్ ప్రేమించి పెళ్ళాడితే, వివాహబంధంతో ఒక్కటై జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటే…అదే అరమరికలు లేని నిజమైన ప్రేమ.

క్రికెట్లో నిజమైన ప్రేమికులు…

అలాంటి …కల్మషం లేని, నిఖార్సయిన ప్రేమ, ప్రేమికులు కావాలంటే…నాటి నేటితరాలకు చెందిన క్రికెట్ హీరోల జీవితాల్లోకి మనం తొంగిచూడాల్సిందే మరి.

కాలం మారినా…తరాలు మారినా… ఓ జీవనదిలా సాగిపోతున్న క్రికెట్ ఆటలో…వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళటం సాధారణ విషయమే అయినా…విదేశీ యువతులతో ప్రేమలో పడటం, వివాహబంధంతో ఒక్కటి కావటం అసాధారణమనే చెప్పాలి.

పెద్దమనుషుల క్రీడ కమ్ జెంటిల్మెన్ గేమ్ లో గ్లోబల్ లవ్ మనకు ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది.

సోబర్స్ తో అంజు మహేంద్ర లవ్…

వెస్టిండీస్ ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ సర్ గార్ ఫీల్డ్ సోబర్స్….ఆరోజుల్లోనే…భారత యువతి అంజు మహేంద్రతో రోమాన్స్ జరిపిన ఘటనలను నాటితరం క్రికెట్ అభిమానులు కథలుకథలుగా చెప్పుకొంటూనే ఉంటారు.

అంతేకాదు..న్యూజిలాండ్ క్రికెట్ ఆల్ టైమ్ ఓపెనర్ గ్లేన్ టర్నర్…పంజాబీ యువతి సుఖ్విందర్ కౌర్ గిల్ ను 1970 దశకంలోనే ప్రేమించి..పెళ్ళాడి… నటాషా, షాన్ అనే ఇద్దరు పిల్లల తండ్రిగా మారాడు.

అంతేకాదు…టర్నర్ జీవితభాగస్వామిగా మారిన భారత యువతి సుఖ్విందర్ కౌర్…దశాబ్దకాలంపాటు డునేడిన్ నగర మేయర్ గా పని చేసి అటు అత్తింటివారికీ…ఇటు పుట్టింటివారికీ గర్వకారణంగా నిలిచింది.

జహీర్ అబ్బాస్ జీవితభాగస్వామి రీటా లూత్రా…

ఇక..పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ జీవితాన్ని చూస్తే…భారత యువతి రీటా లూత్రాను ప్రేమించి …పెళ్లాడారు. తన జీవితభాగస్వామితో రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడుపుతూ.. ప్రేమను సార్థకం చేసుకొన్నారు.

మైక్ బ్రియర్లీతో గుజరాతీ యువతి ప్రేమ

ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ బ్రియర్లీ సైతం…గుజరాత్ కు చెందిన ఓ యువతితో ప్రేమలో పడి…భారత్ కు అల్లుడుగా మారిపోయారు. 1976లోనే మన సారాబాయికి ప్రేమికుడుగా మారి…ఆ తర్వాత జీవితభాగస్వామిగా నిలిచారు.

వెస్టిండీస్ క్రికెట్ సూపర్ మ్యాన్ వివియన్ రిచర్డ్స్ సైతం…భారత నటి నీనా గుప్తాతో ప్రేమలో పడి… ఓ బిడ్డకు తండ్రిగా నిలిచాడు.

దాయాది దేశాలు భారత్, పాక్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుంది. అయితే…బాలీవుడ్ హీరోయిన్ రీనా రాయ్ తో పాకిస్థాన్ మాజీ ఓపెనర్ మొహిసిన్ ఖాన్ ప్రేమలో పడి…పెళ్లివరకూ వచ్చాడు. ప్రేమకు సరిహద్దులు, శతృత్వం ఉండనే ఉండవని చాటి చెప్పాడు.

షోయబ్ మాలిక్ తో సానియా లవ్…

శ్రీలంక స్పిన్ బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సైతం…తమిళనాడు యువతి మదిమలర్ ను ప్రేమించి..పెళ్లాడి తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. భారత్, శ్రీలంకదేశాల మధ్య.. బంధాన్ని మరింత పటిష్టంగా మార్చాడు.

భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా సైతం…పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి , పెళ్ళాడటం ద్వారా ప్రేమకు సరిహద్దులు లేవని తెలియచెప్పింది.

న్యూజిలాండ్ యువతితో వినోద్ కాంబ్లీ…

కంగారూ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ సైతం…భారత అందాల బరిణ, 2001 సంవత్సరానికి మిస్ ఎర్త్ గా ఎంపికైన మషూమ్ సింగాను ప్రేమించి…2014లో ముంబై వేదికగా జరిగిన వివాహబంధంతో ఒక్కటయ్యాడు.

భారత మాజీ టెస్ట్ ప్లేయర్ వినోద్ కాంబ్లీ…న్యూజిలాండ్ యువతి ఆండ్రియాను ప్రేమించి…జీవితభాగస్వామిగా చేసుకొన్నాడు.

ఇమ్రాన్ తాహీర్ లవ్వే వేరు….

ఇక…పాకిస్తాన్ లో జన్మించి…సౌతాఫ్రికాలోని ఓ యువతి కోసం తనదేశాన్నే విడిచి పెట్టిన పాకిస్థాన్ కమ్ సఫారీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది.

సౌతాఫ్రికా యువతి సుమయ్య దిల్ దార్ తో ప్రేమలో పడిన ఇమ్రాన్ తాహీర్…ప్రేమ కోసం తన మాతృదేశం పాకిస్థాన్ నే విడిచిపెట్టి…సౌతాఫ్రికా లీగ్ లో ఆడటం ద్వారా…ఆ దేశానికే అల్లుడుగా మారిపోయాడు.

వివిధ తరాలకు చెందిన ఈ క్రికెటర్ల జీవితాన్ని, అనుభవాలను చూస్తుంటే…నిష్కళంక ప్రేమకు..హద్దులు, సరిహద్దులు లేవనటం నిజంగా నిజం. నవతరం ప్రేమికులు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్ కమ్ లవర్స్ జీవితాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

First Published:  14 Feb 2019 5:42 AM GMT
Next Story