Telugu Global
Cinema & Entertainment

భారతీయుడు-2 షూటింగ్ మొదలు

ప్రతిష్టాత్మకమైన ఇండియన్-2 సినిమా షూటింగ్ మొదలైంది. చెన్నై శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నటుడు కమల్ హాసన్ పై ఈరోజు కొన్ని షాట్స్ తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. భారతీయుడు సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాతోనే మళ్లీ వీళ్లిద్దరూ కలవడం విశేషం. ఇండియన్-2లో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా దిశా పటానీని సెలక్ట్ చేశారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇవన్నీ అందరికీ […]

భారతీయుడు-2 షూటింగ్ మొదలు
X

ప్రతిష్టాత్మకమైన ఇండియన్-2 సినిమా షూటింగ్ మొదలైంది. చెన్నై శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నటుడు కమల్ హాసన్ పై ఈరోజు కొన్ని షాట్స్ తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. భారతీయుడు సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాతోనే మళ్లీ వీళ్లిద్దరూ కలవడం విశేషం.

ఇండియన్-2లో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా దిశా పటానీని సెలక్ట్ చేశారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ యూనిట్ గుట్టుగా ఉంచుతున్న విషయం ఇంకోటి ఉంది. ఈ సినిమాలో విలన్ గా సిద్దార్థ్ కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని మాత్రం యూనిట్ బయటకు చెప్పట్లేదు.

సిద్దార్థ్ మేకోవర్ పూర్తయిన తర్వాత, ప్రత్యేకమైన గెటప్ తో అతడి లుక్ ను విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నాడు. మరోవైపు సిద్ధూ మాత్రం తనకు తెలిసిన వాళ్లందరికీ ఈ సినిమా మేటర్ చెప్పేస్తున్నాడు. హీరోగా అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న సిద్దార్థ్ కు ఇండియన్-2 అయినా కలిసొస్తుందేమో చూడాలి. మార్చి నుంచి సిద్ధూ, ఇండియన్-2 సెట్స్ పైకి వెళ్తాడట.

First Published:  13 Feb 2019 8:30 PM GMT
Next Story