Telugu Global
National

ఢిల్లీ అధికారాల‌పై సుప్రీం కోర్టు తీర్పు

దేశ రాజ‌ధాని ఢిల్లీపై అధికారాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంటాయా, లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు ఉంటాయా అన్న దానిపై చాలా కాలంగా వివాదం న‌డుస్తోంది. ఈ విష‌యంలో కేంద్రానికి, కేజ్రీ స‌ర్కార్‌కు యుద్ధ‌మే న‌డిచింది. ఢిల్లీలో ఎవ‌రికి అధికారులు ఉంటాయ‌న్న దానిపై సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రిచింది. ఢిల్లీ ప్ర‌భుత్వానికి, లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు ఏఏ అధికారాలు ఉంటాయ‌న్న దానిపై ఆరు విష‌యాల్లో సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌త ఇచ్చింది. కీల‌క‌మైన నాలుగు అధికారాల్లో నిర్ణ‌యం కేంద్రం ప‌రిధిలోనే ఉంటుంద‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం […]

ఢిల్లీ అధికారాల‌పై సుప్రీం కోర్టు తీర్పు
X

దేశ రాజ‌ధాని ఢిల్లీపై అధికారాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంటాయా, లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు ఉంటాయా అన్న దానిపై చాలా కాలంగా వివాదం న‌డుస్తోంది. ఈ విష‌యంలో కేంద్రానికి, కేజ్రీ స‌ర్కార్‌కు యుద్ధ‌మే న‌డిచింది.

ఢిల్లీలో ఎవ‌రికి అధికారులు ఉంటాయ‌న్న దానిపై సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రిచింది. ఢిల్లీ ప్ర‌భుత్వానికి, లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు ఏఏ అధికారాలు ఉంటాయ‌న్న దానిపై ఆరు విష‌యాల్లో సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌త ఇచ్చింది. కీల‌క‌మైన నాలుగు అధికారాల్లో నిర్ణ‌యం కేంద్రం ప‌రిధిలోనే ఉంటుంద‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది.

కీల‌క‌మైన ఏసీబీపై అధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌నియంత్రణలోనే ఉంటాయ‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసే అధికారం కూడా ఎల్‌జీకే ఉంటుందని తేల్చి చెప్పింది.

ఏసీబీ, గ్రేడ్ 1, 2 అధికారుల బ‌దిలీ , పోస్టింగుల అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలోనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. విద్యుత్, రెవెన్యూ శాఖ‌ల‌పై అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంటుందని తీర్పు చెప్పింది. గ్రేడ్ 3, 4 ఉద్యోగుల బ‌దిలీలు, పోస్టింగుల అధికారం ఢిల్లీ ప్ర‌భుత్వానికే ఉంటుంద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది.

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఇతర న్యాయ అధికారుల నియామకాన్ని కూడా దిల్లీ ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసింది. ఇత‌ర అధికారుల ప‌రిధిని నిర్ధ‌యించేందుకు కేసును సుప్రీం కోర్టు విస్రృత ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేశారు.

First Published:  14 Feb 2019 4:28 AM GMT
Next Story