సూర్య మరోసారి అదరగొట్టాడు

నందగోపాలకృష్ణ.. ఇలా చెబితే ఎవరికీ అర్థంకాకపోవచ్చు. ఎన్జీకే అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కోలీవుడ్ ఆడియన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న సూర్య-సెల్వరాఘవన్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సెల్వ డైరక్షన్ కు సూర్య యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో టీజర్ తో మచ్చుకు రుచిచూపించారు.

టీజర్ లో నందగోపాలకృష్ణగా సూర్య అదరగొట్టాడు. లుక్, మేకప్ పరంగా కొత్తదనం ఏమీ లేనప్పటికీ యాంగ్రీ యంగ్ మేన్ లా కనిపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో లవ్ స్టోరీ వస్తుందని ఆశిస్తే, ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని వదిలారు.

రకుల్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ ఒకేసారి థియేటర్లలోకి రానుంది ఎన్జీకే.