Telugu Global
NEWS

ప్ర‌మోష‌న్ల‌లో 34 మంది ఒకే సామాజిక‌వ‌ర్గ‌మా?.. త‌ల‌సాని ఫైర్

ఏపీలో పాల‌న ఆశాజ‌న‌కంగా లేద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌ అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌వైపు రెవెన్యూ లోటు అంటూనే నాలుగున్న‌రేళ్లుగా చంద్ర‌బాబు దుబారా చేస్తూనే ఉన్నార‌ని విమ‌ర్శించారు. తాను ఏపీకి వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత త‌మ వారిని చంద్ర‌బాబు వేధించార‌ని ఆరోపించారు. త‌న‌ను క‌లిసిన వారిపై కేసులు పెట్టించార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు తీరుచూస్తుంటే మ‌నం భార‌త దేశంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా అన్న‌ది అర్థం కావ‌డం లేద‌న్నారు. నాలుగున్న‌రేళ్లుగా ఏమీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు… ఇప్పుడు ప‌ప్పుబెల్లాలు పంచే […]

ప్ర‌మోష‌న్ల‌లో 34 మంది ఒకే సామాజిక‌వ‌ర్గ‌మా?.. త‌ల‌సాని ఫైర్
X

ఏపీలో పాల‌న ఆశాజ‌న‌కంగా లేద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌ అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌వైపు రెవెన్యూ లోటు అంటూనే నాలుగున్న‌రేళ్లుగా చంద్ర‌బాబు దుబారా చేస్తూనే ఉన్నార‌ని విమ‌ర్శించారు. తాను ఏపీకి వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత త‌మ వారిని చంద్ర‌బాబు వేధించార‌ని ఆరోపించారు. త‌న‌ను క‌లిసిన వారిపై కేసులు పెట్టించార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు తీరుచూస్తుంటే మ‌నం భార‌త దేశంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా అన్న‌ది అర్థం కావ‌డం లేద‌న్నారు.

నాలుగున్న‌రేళ్లుగా ఏమీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు… ఇప్పుడు ప‌ప్పుబెల్లాలు పంచే ప‌ని మొద‌లుపెట్టార‌న్నారు. కేంద్రం రైతుల‌కు ఆరు వేలు ఇస్తుంటే దానికి నాలుగు వేలు క‌లిపి ఇస్తూ… మొత్తం తామే ఇస్తున్న‌ట్టుగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో ఐదు శాతం కాపుల‌కు ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం ప‌చ్చి మోసమ‌న్నారు.

అలా చేయ‌డం చెల్లుబాటు కాద‌ని తెలిసి కూడా తాను ఏం చేసినా న‌డుస్తుంది అన్న‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. పాల‌వ్యాపారం చేసే రైతులు పూట‌గ‌డ‌వ‌ని స్థితిలో ఉంటే చంద్ర‌బాబు హెరిటేజ్ కంపెనీ మాత్రం వంద‌ల కోట్లు లాభాలు చూపెడుతోంద‌న్నారు. విజ‌య‌వాడ‌లో ఫ్లైఓవ‌ర్ కూడా క‌ట్ట‌లేని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుది అని త‌ల‌సాని విమ‌ర్శించారు. అమ‌రావ‌తి పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నార‌న్నారు.

చంద్ర‌బాబు బీసీల‌ను మోసం చేస్తున్నార‌ని… వారంద‌రిని సంఘ‌టితం చేస్తామ‌ని త‌ల‌సాని చెప్పారు. అత్యంత అవినీతిమ‌య‌మైన ప్ర‌భుత్వంగా టీడీపీ ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ఎవ‌రికి జై కొడితే మిగిలిన వారంతా కూడా వారికే జై కొట్టాల‌న్న‌ట్టుగా టీడీపీ తీరు ఉంద‌న్నారు. ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెడితే ఇప్పుడు ఆ పార్టీని తీసుకెళ్లి రాహుల్ గాంధీ కాళ్ల వ‌ద్ద తాక‌ట్టు పెట్టేశార‌న్నారు. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు బీసీల‌కు అండ‌గా నిలిచిన మాట వాస్త‌వ‌మేన‌ని… కానీ ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌న్నారు.

ఢిల్లీలో ధ‌ర్నాలు ఇప్పుడు కాకుండా మూడేళ్ల క్రిత‌మే చేసి ఉంటే అంతో ఇంతో లాభం జ‌రిగి ఉండేంద‌న్నారు. ఒక్కో ప్రాజెక్టుకు 10 నుంచి 15 శంకుస్థాపన‌లు చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. ఇటీవ‌ల 35 మంది సీఐల‌కు ప్రమోష‌న్ ఇస్తే అందులో 34 మంది ఒక చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం వారే ఉన్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. బీసీలు, మిగిలిన సామాజిక‌వ‌ర్గాల వారికి ప్ర‌మోష‌న్లు అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నించారు.

ఏపీ ప్ర‌జ‌లు ప‌న్నుల రూపంలో చెల్లించిన రూ.500 కోట్లు తీసుకొచ్చి తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఖ‌ర్చు పెట్టార‌ని త‌ల‌సాని వివ‌రించారు. ఆంధ్ర‌ప్రదేశ్‌తో క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని… కానీ చంద్ర‌బాబు చిల్ల‌ర రాజ‌కీయాల కార‌ణంగానే వాతావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌న్నారు. . ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్ల‌మెంట్‌లో డిమాండ్ చేశార‌ని త‌ల‌సాని గుర్తు చేశారు.

First Published:  13 Feb 2019 11:23 PM GMT
Next Story